భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,72,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,72,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కూడా మరణాల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళన కల్గిస్తుంది. ఈరోజు 1,008 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,97,70,414 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాల సంఖ్య.....
ప్రస్తుతం దేశంలో 15,33,921 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,18,03,318 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,98,983 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,67,87,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.