ఈరోజు స్వల్పంగా భారత్ లో పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు రోజుల తర్వాత మూడు లక్షల దిగువన కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 665 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,73,70,971 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 22,23,018 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,00,85,116 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,91,127 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది.