తగ్గుతున్న కేసులు... పెరుగుతున్న మరణాలు

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,09,918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2022-01-31 04:00 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,09,918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు లక్షలకు పైగా నమోదయిన కేసులు గత నాలుగు రోజుల నుంచి రెండు లక్షలకు చేరుకుంది. మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశం. నేడు కరోనాతో 959 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,89,76,122 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరణాలు మాత్రం...
ప్రస్తుతం దేశంలో 18,31,268 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,13,02,440 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,95,050 మంది మరణించారు. భారత్ లో రోజువారి పాజిటివిటీ రేటు 15.77 శాతంగా నమోదయింది.


Tags:    

Similar News