భారత్ కు రిలీఫ్.. తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,35,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,35,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా భారత్ లో కేసుల సంఖ్య తగ్గుతుండటం ఊరట కల్గించే అంశం. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 871 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,83,60,710 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు..
ప్రస్తుతం దేశంలో 20,04,333 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,08,58,241 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,93,198 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 13,39 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు కూడా తగ్గింది.