భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఈరోజు కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఈరోజు కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 1,241 మంది మరణించారు. మరణాల సంఖ్య బాగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,11,80,751 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు తగ్గుతున్నా.....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 7,90,789 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,24,78,060మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,06,520మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది.