నెల రోజుల తర్వాత రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,07,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2022-02-06 04:59 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,07,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెలరోజుల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్నటితో పోలిస్తే ఇరవై వేల కేసులు తగ్గాయి ఈరోజు 865 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,04,61,148 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసులు.....
ప్రస్తుతం దేశంలో 12,25,011 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 5,40,52,712 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,01,979 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,69,21,44,432 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News