నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో రాష్ట్రాలు కూడా ఆంక్షలను సడలిస్తున్నాయి.

Update: 2022-02-07 01:57 GMT

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో రాష్ట్రాలు కూడా ఆంక్షలను సడలిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు సిద్ధమయింది. నేటి నుంచి ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.

ప్రాధమిక తరగతులు....
నేటి నుంచి 9 నుంచి 12వ తరగతులు ప్రారంభించడానికి మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాధమిక తరగతులను ప్రారంభించలేదు. కోవిడ్ కేసులు తగ్గుతుండటంతో నేటి నుంచి ఢిల్లీలో పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ క్లాసులు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News