భారత్ లో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మూడు లక్షలు దాటేశాయి. ఈరోజు కొత్తగా 3,13, 603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు మూడు లక్షలు దాటేశాయి. ఈరోజు కొత్తగా 3,13, 603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 475 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,86,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాలు కూడా...
ప్రస్తుతం దేశంలో 18,90,202 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,13,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,86,651 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,59,88,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 9,2871 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 16.41 శాతంగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697, కర్ణాటకలో 40,499, కేరళలో 34,199 కేసులు నమోదయ్యాయి.