భారత్ లో యాభై వేలకు దిగువన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 6,093 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-09-09 04:45 GMT

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 6,093 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే 6,768 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.7 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.11 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకిన వారిలో 90 శాతం మంది హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

హోం ఐసొలేషన్ లోనే...
భారత్ లో ఇప్పటి వరకూ 4,44,72,241 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,06,972 చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,28,121 మంది మరణించారు. ప్రస్తుతం 49,636 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 214.55 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వేశామని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News