Sonia : మమ్మల్ని ఇబ్బంది పెడుతూ.. గెలిచేందుకు మోదీ కుట్ర

ఎన్నికలకు ముందు తమను ఇబ్బంది పెట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు

Update: 2024-03-21 06:48 GMT

ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సోనియా గాంధీ అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా బయటపడిన విషయాలపై లోతైన దర్యాప్తు జరగాలని ఆమె ఆకాంక్షించారు. తమను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే అనైతిక చర్యలకు దిగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సోనియా గాంధీ అన్నారు.

అకౌంట్లను ఫ్రీజ్ చేసి...
బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా ఎంత మొత్తం వచ్చిందో బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీకి వేల కోట్ల రూపాయల బాండ్ల రూపంలో నిధులు అందాయని, కాంగ్రెస్ అకౌంట్లను మాత్రం ఫ్రీజ్ చేశారన్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు ఇటువంటి చర్యలకు కేంద్రప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని వారు ఆరోపించారు. ఫ్రీజ్ చేసిన ఖాతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పుడే ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు పాల్గొన్నారు.


Tags:    

Similar News