Rahul Gandhi : మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ సంచలన కామెంట్స్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకు తగిన ఆధారాలు లభించాయని తెలిపారు. జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారని రాహుల్ తెలిపారు. ఫేక్ ఓటర్లు హిమాచల్ ప్రదేశ్ కంటే అధికంగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మీడియాసమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కారణం ఓటర్ల తీర్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫేక్ ఓటర్ల పేరుతో...
కొత్త ఓటర్ల చేరిక పేరుతో ఫేక్ ఓటర్లను చేర్చారంటూ ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాకు, జనాభా లెక్కలకు మధ్య పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఇది ఎలా సాధ్యమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ నిలదీశారు. ఓటర్లు జనాభా కంటే ఎలా ఎక్కువ ఉంటారని ఆయన ప్రశ్నించారు. చాలాచోట్ల దళిత, గిరిజన ఓట్లను తొలగించారన్నారు. గణాంకాలు ముందు పెట్టి అడుగుతున్నానన్న రాహుల్ గాంధీ, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలన్నారు.