కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడ ఓటర్లు
ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. మ్యాజిక్ ఫిగర్‌కు మించి ఈ సర్వేలో స్థానాలు లభించాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. మ్యాజిక్ ఫిగర్‌కు మించి ఈ సర్వేలో స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటుందని సీ డైలీ ట్రాకర్ అనే సంస్థ తన సరవేలో వెల్లడించింది.
సీట్లు ఇలా...
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలుండగా కాంగ్రెస్ 157 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉందని సీ డైలీ ట్రాకర్ స్పష్టం చేసింది. 56 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలోనూ, 34 స్థానాలతో జేడీఎస్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇతరులకు సున్నా నుంచి మూడు స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది.