నేడు కూడా సోనియా ఈడీ ఎదుటకు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు

Update: 2022-07-27 03:39 GMT

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నిన్న సోనియాను దాదాపు 12 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఈరోజు కూడా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీల్యాండరింగ్ పై ఈడీ అధికారులు సోనియా గాంధీని ఐదుగురు బృందంతో కూడిన అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందులో మహిళ అధికారి ఒకరున్నారు. ఈరోజు కూడా సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఆందోళనకు.....
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ వ్యాప్త ఆందోళనలకు దిగుతుంది. సోనియా విచారణ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. నిన్న స్వయంగా రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. ఈరోజు కాంగ్రెస్ కు మద్దతుగా అన్ని విపక్షాలు కూడా ఆందోళనలో పాల్గొనే అవకాశముంది. ఈ మేరకు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో పార్లమెంటు లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనున్నారు.


Tags:    

Similar News