నేడు ఢిల్లీలో కాంగ్రెస్ న్యాయసదస్సు
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది.
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. రాజ్యాంగ విలువల పరిరక్షణ పేరిట కాంగ్రెస్ సదస్సు జరగనుంది. సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కీలక నేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
సదస్సు తర్వాత...
నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న సదస్సులో పాల్గొంటారు. ఏఐసీసీ కాన్‌క్లేవ్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.