ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు సమావేశమయ్యారు

Update: 2025-05-11 05:57 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు పాక్ ఉల్లంఘించడం అంశపై చర్చించనున్నారు. రేపు జరగనున్న రెండు దేశాల దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చల్లో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

కాల్పుల విరమణ అనంతరం...
కాల్పుల విరమణ అనంతరం పరిస్థితులపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో చర్చించనున్నారు. రేపు జరగబోయే చర్చల్లో ఏ ఏ అంశాలను చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించనున్నారు. పాక్ ఉల్లంఘిస్తే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా మోదీ ఈ సమావేశంలో అధికారులతో చర్చంచనున్నారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా హాజరయ్యారు.


Tags:    

Similar News