గుడ్ న్యూస్...హైవేలపై ఉచితంగా పెట్రోల్ డెలివరీ

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-04-24 06:14 GMT

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. హైవేపై ప్రయాణిస్తున్నవారి వాహనాల్లో పెట్రోలు అయిపోతే వెంటనే ఉచితంగా డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఫోన్ చేసిన పది హేను నిముషాల్లోనే డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే పెట్రోలు ధర మాత్రం చెల్లించాలి. డెలవరీ ఛార్జీల వరకూ ఉచితమని చెబుతున్నారు.

పదిహేను నిమిషాల్లోనే...
హైవే పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ అయిపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ 1033 కి కాల్ చేసి ఐదు నుంచి పది లీటర్ల పెట్రోల్ ను ఫ్రీగా ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ పూర్తిగా ఉచితంగా చేస్తారు. కేవలం పెట్రోల్కు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. గతంలో కూడా ఈ సౌకర్యం ఉన్నా, ప్రస్తుతం ఆర్డర్ చేసిన పదిహేను నిమిషాల్లోనే డెలివరీ చేసేటట్లుగా కేంద్రం చర్యలు చేపట్టింది.


Tags:    

Similar News