Breaking : గుడ్ న్యూస్.. భారత్ లో తెరచుకోనున్న విమానాశ్రాయాలు

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూతబడిన విమానాశ్రయాలను తెరవాలని నిర్ణయించింది

Update: 2025-05-12 07:43 GMT

bomb threats 

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూతబడిన విమానాశ్రయాలను తెరవాలని నిర్ణయించింది. వాస్తవానికి పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో దేశంలో 32 విమానాశ్రయాలను మూసి వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్టు అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాల్పుల విరమణ ఒప్పందంతో...
అయితే పాక్ - భారత్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో పాటు చర్చలు కూడా ప్రారంభం కావడంతో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఏ ఏ విమానాలు తిరిగి ఎయిర్ అవుతాయన్నది ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలను ప్రయాణికులు సంప్రదించాలని కేంద్రం తెలిపింది. ఈ నెల 15వ తేదీ వరకూ మూసివేయాలని ముందు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించి తిరిగి విమానాశ్రయాలను తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Tags:    

Similar News