కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... వంట నూనెల ధరలు దిగి వస్తున్నాయ్
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనె ధరలు తగ్గుతున్నాయి. దీంతో ప్రజలకు ఉపశమనం కలగనుంది
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనె ధరలు తగ్గుతున్నాయి. దీంతో ప్రజలకు ఉపశమనం కలగనుంది. నిన్న మొన్నటి వరకూ వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. నూనె ధరలు కొనాలంటే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది సెప్టంబరు నెలలో ప్రభుత్వం వంట నూనెల ముడిసరుకులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. దీంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పెరగడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి.
వంటనూనె సీసా ధరపై...
వంటనూనె లేకుండా పూట గడవడం కష్టమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఒక్కొక్క నూనె సీసాధరపై ఇరవై నుంచి ముప్ఫయి రూపాయలు ధర పెరిగింది. సామాన్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం దీనిపై ఆలోచించి దిగుమతి సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దంతో ముడి వంట నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని ఇరవై శాతం నుంచి పది శాతం వరకూ తగ్గించాలని నిర్ణయించడంతో వంట నూనె ధరలు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది సామాన్యులకు ఊరట కల్గించే అంశమని చూడాలి.
మహిళల్లో అసంతృప్తి...
వంట నూనె లేకుండా ఏ పని జరగకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని చాలా రోజుల నుంచి కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ముడి చమురు పై సుంకాన్ని తగ్గించడంతో వంటనూనెల ధరలు భారీగా తగ్గే అవకాశముందని బిజినెస్ నిపుణఉలు చెబుతున్నారు. పెరిగిన ధరలు చాలా వరకూ తగ్గి గతంలో మాదిరిగా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. శుద్ధి చేసిన వంట నూనెల ధరలు దేశ వ్యాప్తంగా భారీగా తగ్గే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.