జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్
జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోసారి ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో్ హై అలెర్ట్ ను ప్రకటించారు.పలు ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాల మోహరించారు. అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. నిన్న జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.
దాడి జరిగిన నేపథ్యంలో...
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతానికి కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. అంతకు ముందు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో జమ్ముకశ్మీర్‌లో బంద్ ను కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్‌లో ప్రజలు, వ్యాపారులు పాల్గొన్నారు.