కరోనాపై కేంద్రం అలర్ట్.. మళ్లీ డేంజర్ బెల్స్

కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఈ మేరకు లేఖ రాసింది

Update: 2022-12-21 02:37 GMT

కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు లేఖ రాసింది. కరోనా మరోసారి విజృంభించే అవకాశముందని అందులో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అందులో తెలిపింది.

వారానికి 35 లక్షలు...
వారానికి ముప్ఫయి ఐదు లక్షల కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. ప్రధానంగా చైనా, జపాన్ వంటి దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అందుకే దేశంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు వస్తాయని హెచ్చరించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్స్ కు పంపాలని, కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.


Tags:    

Similar News