Bihar : నేడు బీహార్ కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు

బీహార్ లో నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు పర్యటించనున్నారు

Update: 2025-10-04 02:24 GMT

బీహార్ లో నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు పర్యటించనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఎన్నికల సంఘం ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీహార్ లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సమావేశమై చర్చించనున్నారు. ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక్కొక్కరికి సమావేశానికి అవకాశం ఇవ్వనున్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ...
ఈ ఏడాది బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బీహార్ లోని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తీసుకోనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ పూర్తి కావడంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముంది.


Tags:    

Similar News