Breaking : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది
central election commission
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది. ఓటర్లు సులువుగా గుర్తుతో పాటు పార్టీ అభ్యర్థులను గుర్తు పట్టేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
కలర్ ఫొటోలు...
ఇకపై ఏ శాసనసభ లేదా పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలర్ ఫొటోలు ఇక పై ఈవీఎంలో కనిపించేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఓటర్ల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఓటర్లకు మరింత వెసులు బాటు కల్పించేలా ఈ నిర్ణయం కలిపించింది. కలర్ ఫొటోల వల్ల 20 ఎంఎం సైజులో ఉండనుంది. గుర్తు 40 ఎంఎం సైజులో ఉండనుంది.