General Elections 2024 schedule: మోగిన ఎన్నికల నగారా షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే?

కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ తో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది

Update: 2024-03-16 10:25 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలోనూ అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ పద్దెనిమిదోతేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఇరవై ఐదో తేదీ  నామినేషన్లను స్వీకరించడానికి ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఇరవై ఆరోతేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఇరవై తొమ్మిదో తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 

General Elections 2024 schedule:కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఈరోజు షెడ్యూల్ విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లయింది. ఎన్నికల నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మొత్తం దశలలో ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ ప్రారంభమై చివరి దశలో పోలింగ్ ముగియనుంది. దేశ వ్యాప్తంగా కౌంటింగ్ నాడు జరగనుంది.

96.8 కోట్ల మంది ఓటర్లు...
దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో 1.50 కోట్ల మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. 55 లక్షల ఈవీఎంలను ఇందుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. జూన్ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1.85 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికను నిర్వహించేందుకు అధికారులతో సహా అందరూ ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలింగ్‌లో మహిళలు, యువత పాల్గొనేలా ఓటు హక్కు విలువ గురించి రాష్ట్రాల్లో తెలియజేస్తున్నామని తెలిపారు.
ఇంటి వద్దనే ఓటు...
85 ఏళ్లు దాటిని వారికి ఇంటి వద్దనే ఓటు వేసుకునే వీలును కల్పిస్తున్నామని తెలిపారు. ఏదైనా ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మజిల్, మనీ, మిస్ ఇన్‌ఫర్మేషన్ వంటి వాటిని సహించబోమని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డబ్బులు చేరవేయకుండా వేల సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా జిల్లాకేంద్రంలో ప్రత్యేకంగా ఫిర్యాదులను పరిష‌్కరించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వాలంటీర్లను నో...
చెక్ పోస్టుల సంఖ్యను మరింతగా పెంచి మనీ తరలింపును అడ్డుకునేందుకు అన్ని రకాలుగా అధికారులు ప్రయత్నిస్తారన్నారు. వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదని తెలిపారు. టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతర నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. నగదును తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ ను ఏర్పాటు చేశామన్నారు. నగదు, లిక్కర్ వంటి పంపిణీ జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘాను పెంచామని తెలిపారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రయివేటు విమానాలు, హెలికాప్టర్లలో కూడా తమ అధికారులు తనిఖీ చేస్తామని తెలిపారు. రైలు, రోడ్డు మార్గంలో వచ్చే నగదును కూడా అరికట్టేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంక్ లావాదేవీలపై నిఘా ఉంచుతామని చెప్పారు.
లోక్‌సభ షెడ్యూల్ ఇలా...
లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ పందొమ్మిదిన తొలి విడత ఎన్నిక జరగనున్నాయి. రెండో దశలో ఇరవై ఒకన, మే ఏడోతేదీన మూడో, మే పదమూడున నాలుగో దశ, మే ఇరవై తేదీన ఐదో దశ, మే ఇరవై ఐదోతేదీన ఆరోదశ ఎన్నికలు జూన్ ఒకటో తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ దేశ వ్యాప్తంగా జూన్ నాలుగోతేదీన జరగనుంది. 


Tags:    

Similar News