చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లల్లో సీబీఐ సోదాలు

కార్తీ చిదంబరంపై కొనసాగుతున్న కేసులకు సంబంధించి ఈ సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు. 2010-14 మధ్య కాలంలో..

Update: 2022-05-17 04:22 GMT

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తోంది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైల్లోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఇటీవల కార్తీ చిదంబరం పై సీబీఐ కేసు కూడా నమోదైంది.

కార్తీ చిదంబరంపై కొనసాగుతున్న కేసులకు సంబంధించి ఈ సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు. 2010-14 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ తాజాగా కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరం తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించినందుకు INX మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (FIPB) క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది. మే 15, 2017న ఈ వ్యవహారంపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరాన్ని 2018 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, మార్చిలో నెల రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది.


Tags:    

Similar News