Bengaluru : బెంగళూరు బీజేపీ నేతలపై కేసు నమోదు

బెంగళూరు గాంధీనగర్ నియోజకవర్గంలో నిరసన చేపట్టి హైకోర్టు ఆదేశాలను అతిక్రమించినందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు

Update: 2025-09-26 05:06 GMT

బెంగళూరు గాంధీనగర్ నియోజకవర్గంలో నిరసన చేపట్టి హైకోర్టు ఆదేశాలను అతిక్రమించినందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఎక్కడా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. వాటిని పట్టించుకోకుండా నిరసనకు దిగారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు...
పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర పిలుపు మేరకు సెప్టెంబర్ 24న రహదారులపై గుంతలు, దుర్వస్థితిని ఎత్తిచూపేందుకు పార్టీ నిరసన కార్యక్రమం ప్రకటించారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షుడు సప్తగిరి గౌడ నేతృత్వంలో కార్యకర్తలు ఉదయం 11.30 గంటలకు గాంధీనగర్ ఆర్టీ స్ట్రీట్‌లో రహదారి దిగ్బంధనానికి దిగారు. నిరసన మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ నిరసన వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగాయని, కోర్టు ఆదేశాలను ధిక్కరించారని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News