లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి: కలకత్తా కోర్టు

మైనర్‌ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొన్న ఓ వ్యక్తికి

Update: 2023-10-21 03:11 GMT

యుక్తవయస్కులకు కలకత్తా హై కోర్టు కీలక సూచనలు చేసింది. అక్టోబరు 18న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులో కౌమారదశలో ఉన్న బాలికలు రెండు నిమిషాల ఆనందం కోసం పాకులాడకండని.. లైంగిక ప్రేరణలను నియంత్రించాలని కోరింది. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని.. ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని, చెడ్డపేరు తెస్తుందని తెలిపింది. తల్లిదండ్రులే మొదటి గురువుగా ఉండాలని, పిల్లలకు మంచిచెడులు చెప్పాలని తెలిపింది. పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

మైనర్‌ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొన్న ఓ వ్యక్తికి సెషన్స్‌ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథిసేన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తన ఇష్టపూర్వకంగానే సంబంధం పెట్టుకున్నానని సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అనంతరం అతడిని పెళ్లి చేసుకొన్నట్టు చెప్పింది. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె కోర్టు ఎదుట ఒప్పుకొన్నది. దీంతో ఈ కేసులో నిందితుడిని కలకత్తా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
యువతీయువకులకు ధర్మాసనం పలు సూచనలు జారీ చేసింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అన్నింటికంటే ముఖ్యమని సూచించింది. అమ్మాయిలను అబ్బాయిలు గౌరవించాలని.. వారి హక్కులు, గోప్యతను కాపాడాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన యువకుడిని విడుదల చేస్తూ డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు చిత్త రంజన్ దాష్, పార్థ సారథి సేన్‌లు ఈ సూచనలు చేశారు.


Tags:    

Similar News