Kerala : తిరువనంతపురం కార్పొరేషన్ ను చేజిక్కించుకున్న బీజేపీ
కేరళ లోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఘన విజయం సాధించింది
కేరళ లోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. లెఫ్ట్ డమొక్రటిక్ ఫ్రంట్ ను కాదని తిరువనంతపురం ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. నాలుగు దశాబ్దాల నుంచి తిరువనంతపురం కార్పొరేషన్ లో తిరుగులేదు. అయితే దానిని కాదని కేరళ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేయడంతో లెఫ్ట్ పార్టీలకు పెద్ద దెబ్బేనని చెప్పాలి.
నాలుగు దశాబ్దాల తర్వాత...
తిరువనంతపురంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ శశిధరూర్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు బలంగా ఉన్న ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేయడంతో కేరళలో కూడా బీజేపీ విజయానికి మరింత దగ్గరవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ గెలిచిన స్థానిక బీజేపీ నేతలను స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.