కేసీఆర్ సర్జికల్ కామెంట్స్ పై బీజేపీ ఫైర్
సర్జికల్ స్ట్రయిక్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు
సర్జికల్ స్ట్రయిక్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఆరు నెలల పాటు పాకిస్థాన్ నో ఫ్లై జోన్ గా ప్రకటించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఇది అమరవీరులను అవమానించడమేనని కేసీఆర్ పై అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి వత్తాసు పలకడమేనని ఆయన అన్నారు. కేసీఆర్ సర్జికల్ స్ట్రయిక్ పై మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.
మతి భ్రమించిందని....
సర్జకల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ మాట్లాడిన మాటలు అర్థరహితమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కేసీఆర్ కు మతి భ్రమించిందని చెప్పారు. గాంధీ కటుంబంపై విధేయతను ప్రకటించుకోవడానికే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వీర జవాన్లను అవమానిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ కు మతి భ్రమించిందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు అమరులైన వారిని అవమానించినట్లే ఉందని అన్నారు.