డబ్బులకే కాదు.. ఇప్పుడు బిర్యానీకి కూడా ఏటీఎం

నిజమే నండి. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికింది. బిర్యానీ ఏటీఎం అనే సరికొత్త ఐడియాతో..

Update: 2023-03-14 06:14 GMT

bvk biryani atm

మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను అప్పటికప్పుడు విత్ డ్రా చేయాలంటే ఏటీఎం కు వెళ్తాం. అలానే దుబాయ్ లో బంగారం కొనుగోలుకీ ఏటీఎంలు ఉన్నాయి. కానీ.. ఫుడ్ కి ఏటీఎం లు ఎక్కడైనా చూశారా. అందులోనూ ఈ రోజుల్లో ప్రతిఒక్కరి ఫేవరెట్ ఫుడ్ అయి బిర్యానీ ఏటీఎంలు ఉన్నాయంటే నమ్ముతారా. నిజమే నండి. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికింది. బిర్యానీ ఏటీఎం అనే సరికొత్త ఐడియాతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. చెన్నైలోని కొలత్తూర్ లో బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. బాయ్ వీటు కల్యాణం (బీవీకే) బిర్యానీ పాయింట్ దేశంలోనే తొలిసారిగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది.

సాధారణంగా ఏటీఎం లో మనీ విత్ డ్రా ఆప్షన్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే పెట్టారు. మెషీన్ కు అమర్చిన స్క్రీన్ పై మెనూ ఉంచారు. అందులో మనకు కావాల్సిన బిర్యానీని ఎంచుకుని పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బిర్యానీ ధరను కార్డు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించాక స్క్రీన్ పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. ఆ టైమర్ పూర్తయ్యేసరికి వేడి వేడి బిర్యానీ పార్సిలై బయటికొస్తుంది. ఏటీఎం మెషిన్ కు ఉన్న చిన్న డోర్ ను తెరిచి లోపల ఉన్న బిర్యానీని తీసుకెళ్లిపోవడమే. బీవీకే వారి ఈ ఐడియా చాలా బాగుందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.






Tags:    

Similar News