నేడు గుజరాత్ సీఎంగా ప్రమాణం

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు

Update: 2022-12-12 03:31 GMT

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 150 సీట్లకు పైగానే బీజేపీ చేజిక్కించుకుంది. దీంతో బీజేపీ అధినాయకత్వం భూపేంద్ర పటేల్ కు రెండో సారి ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టేందుకు అవకాశమిచ్చింది.

రెండుసారి సీఎంగా...
గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణస్వీకారం చేయనునున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరు కానున్నారు. 156 స్థానాలను సాధించడంతో మంత్రి వర్గ కూర్పు ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలిసింది. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ తో పాటు కొందరు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News