BJP : ఈ నెల 20 తర్వాత బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెలలో ఎంపిక చేయనుంది.

Update: 2025-04-17 02:11 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెలలో ఎంపిక చేయనుంది. ఈనెల 20వ తేదీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశముంటుంది. రెండు రోజుల్లో ఆరు రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిన్న ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రధాని నివాసంలో...
ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌, నడ్డా వంటి నేతలు పాల్గొని జాతీయ అధ్యక్షుడు, రాష్ట్రాల అధ్యక్షుల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, పుదుచ్చేరి బీ.ునీ అధ్యక్షులను ప్రకటించనున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News