BJP : బీజేపీ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసా?

దేశంలో భారతీయ జనతా పార్టీ అత్యంత ధనం కలిగిన పార్టీగా ఆవిర్భవించింది.

Update: 2025-01-29 04:38 GMT

దేశంలో భారతీయ జనతా పార్టీ అత్యంత ధనం కలిగిన పార్టీగా ఆవిర్భవించింది. గత మూడు దఫాల నుంచి వరసగా కేంద్రంలో అధికారంలోకి వస్తుండటంతో ఆ పార్టీకి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. మోదీ నాయకత్వంలో పార్టీ దేశంలో విస్తరించడమే కాకుండా ఆర్థికంగా కూడా బలోపేతమయిందని లెక్కలు చెబుతన్నాయి.

రిచెస్ట్ పార్టీగా దేశంలోనే...
మన దేశంలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పొచ్చు. ఆ పార్టీ ఖాతాలో ప్రస్తుతం 7,113.80 కోట్లు ఉన్నాయి.857 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ కు రాజకీయ పార్టీలు అందజేశాయి. 2023–24లో తమ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 1,685.69 కోట్ల రూపాయలు, ఇతర డొనేషన్ల ద్వారా 2,042.75 కోట్లు వచ్చినట్టు బీజేపీ పేర్కొంది. ఆ ఏడాది మొత్తం 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపింది.


Tags:    

Similar News