కశ్మీర్ రిసార్టులో టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి
కశ్మీర్‌లో ఎలుగుబంటి పర్యాటకులను టెన్షన్ పెట్టింది.
కశ్మీర్‌లో ఎలుగుబంటి పర్యాటకులను టెన్షన్ పెట్టింది. గాందర్‌బల్ జిల్లా సోనామార్గ్‌లోని ఓ రిసార్ట్ వద్ద ఎలుగుబంటి సంచరించడం చూసి జనాలు భయపడిపోయారు. అయితే స్థానికులు కొందరు ఎలుగుబంటిని అక్కడి నుంచి తరిమేశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించారు. సోనామార్గ్‌లో స్థానికులు చెత్తాచెదారాన్ని ఇష్టారీతిన పడేయడంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలుగుబంట్లకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. నిబంధనల అమలును పట్టించుకోని సోనామార్గ్ డెవలప్‌మెంట్ అథారిటీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.