నేడు కర్ణాటక బంద్

ఈరోజు కర్ణాటక మొత్తం బంద్ జరుగుతుంది. రైతు సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి

Update: 2023-09-29 05:19 GMT

ఈరోజు కర్ణాటక మొత్తం బంద్ జరుగుతుంది. రైతు సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు బీజేపీ, జేడీఎస్ లు కూడా మద్దతివ్వడంతో పూర్తి స్థాయిలో బంద్ జరుగుతుంది. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయవద్దంటూ రైతులు కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావేరీ జలాలు రాష్ట్రానికే సరిపడా లేవని, తమిళనాడుకు విడుదల చేయవద్దని రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ఈ వివాదం ముదిరి బంద్ కు దారి తీసింది.

ఐదు జిల్లాల్లో...
కర్ణాటక బంద్ సందర్భంగా ప్రభుత్వం అప్రమత్తమయింది. సమస్యాత్మకమైన ఐదు జిల్లాల్లో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. కన్నడ సంఘాలు, రైతు సంఘాలు, బీజేపీ, జేడీఎస్ లు మద్దతివ్వడంతో బంద్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈసారి తక్కువ వర్షపాతం నమోదయిందని, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయవద్దని కోరుతున్నాయి. కృష్ణగిరి, ధర్మగిరి, సేలం, ఈరోడ్డు జిల్లాల్లో బందోబస్తును మరింత పటిష్టం చేశారు.


Tags:    

Similar News