ఢిల్లీలో కృత్రిమ వర్షం.. పక్కా ప్లాన్ తో!!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
ఢిల్లీ'
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించి, సాంకేతిక సమన్వయం కోసం పూణెలోని భారత వాతావరణ విభాగానికి సమర్పించింది. వాయవ్య, ఔటర్ ఢిల్లీలోని లో-సెక్యూరిటీ ఎయిర్ జోన్లలో ఐదు విమానాలతో ప్రయోగాలు నిర్వహిస్తారు. సెస్నా విమానాల ద్వారా మేఘాలపై రసాయన మిశ్రమాన్ని చల్లుతారు. ప్రతి విమానం సుమారు 90 నిమిషాల పాటు గాలిలో ఉండి, 100 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ మిశ్రమంలో సిల్వర్ అయోడైడ్ నానోపార్టికల్స్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తేమతో నిండిన మేఘాలపై చల్లడం ద్వారా నీటి బిందువులు త్వరగా ఏర్పడి, కృత్రిమ వర్షం కురుస్తుంది. జులై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని, జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగానికి అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.