New Variant : మళ్లీ వైరస్ కలకలం.. శానిటైజర్లు.. మాస్క్ లు వాడాల్సిందే

కేరళలో మరో కొత్త వేరియంట్ కలకలం సృస్టిస్తుంది. కోవిడ్ కేసులు కూడా పెరగడం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2023-12-17 05:39 GMT

 covid cases

వైరస్ ఏది వచ్చినా ఫస్ట్ కేరళలోనే వెలుగులోకి వస్తుంది. కేరళలోనే ఎందుకు కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుంటాయి? కేరళకు చెందిన వారు వివిధ దేశాలు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. అక్కడినుంచి కొత్త వైరస్ లను మోసుకొస్తుంటారు. అందుకే ఏ వేరియంట్ వచ్చినా అది కేరళలోనే తొలుత రికార్డు కావడం అన్ని సార్లు జరుగుతుంది. ఎయిర్ పోర్టుల నుంచి, రైల్వేస్టేషన్ల నుంచి ఎక్కువ మంది ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వేరియంట్లు వస్తున్నాయన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

కొత్త వేరియంట్...
తాజాగా కేరళలో మరొక కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. దీనికి JN.1 వేరియంట్‌గా నామకరణం చేశారు. ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే JN.1 వేరియంట్ ను తొలిసారిగా గుర్తించారు. దీనిని BA.2.86 వేరియంట్ గా కూడా పిలుస్తారట. అమెరికాలో ఇది తొలి సారి కొనుగొన్నారు. కొత్త వేరియంట్ తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ వేరియంట్ ను 79 ఏళ్ల వయసున్న ఒక మహిళలో గుర్తించారు. 2020లో అమెరికాలో ఈ తరహా వేరియంట్ ను గుర్తించినట్లు చెబుతున్నారు.


వేగంగా వ్యాప్తి...
ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇది రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటం కూడా ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే దీనికి మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడమే మంచిదంటున్నారు. శానిటైజర్లను కూడా వాడాల్సిందేనని చెబుతున్నారు. లేకపోతే భారత్ లో ఈ కొత్త వేరియంట్ మరింత విస్తరించే అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News