మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది

Update: 2025-06-17 07:42 GMT

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతున్న విమానం సాంకేతిక లోపంతో ఎయిర్ పోర్టులోనే నిలిపేశారు. ఈ విమానంలో రెండు వందల మంది ప్రయాణికులున్నారు. అయితే అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉంచి సాంకేతిక లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

వరస లోపాలతో...
ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 280 మందికి పైగా మరణించిన నేపథ్యంలో వరసగా ఎయిర్ ఇండియా విమానాలు ఇలా సాంకేతికలోపాలతో ఇబ్బందులు పెడుతుండటం ఆందోళనకరమైన విషయం. నిన్నటి నుంచి నేటి వరకూ మూడు ఎయిర్ విమానాలను సాంకేతిక లోపంతో ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం A1 -159 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే నిలిపేశారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సిన విమానాన్ని నిలిపేశారు.


Tags:    

Similar News