America : ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడుగా... మంచి మిత్రుడినంటూనే వాతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్నాడు. పన్నులు పెంచి భారత్ పై తన వైరాన్ని ప్రదర్శించాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్నాడు. మిత్ర దేశం అంటూనే భారత్ పై పగను పెంచుకునట్లు కనపడుతుంది. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడంటూనే కర్రు కాల్చి వాత పెట్టేలా వ్యవహరిస్తున్నారు. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయని ట్రంప్ తెలిపారు. కానీ భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయంటూ ఆరోపించారు.
అందుకు పెంచడమేమిటి...?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై పన్నుల భారం మోపారు. ట్రంప్ మోపిన భారంతో్ భారత్ నుంచి ఎగుమతి అయ్యే అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 25 శాతం పెంచిన సుంకాలతో భారత ఫార్మా, టెక్స్టైల్, గోల్డ్, డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కెమికల్ రంగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పెరిగిన పన్నుల కారణంగా అమెరికాలో ధరలు పెరిగిన మన కంపెనీలకు తక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశముంది దీంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా దెబ్బతినే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
ఈ రంగాలపై...
పెరిగిన పన్నుల కారణంగా ఎగుమతి ఆదాయం తగ్గి రూపాయి విలువ బలహీన పడుతుంది. భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏటా ఎనభై ఏడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలు ఎగుమతి అవుతవుతున్నాయి. ఒక అమెరికన్ డాలర్, నేడు ఇండియన్ కరెన్సీలో 87.65 రూపాయలుగా లలో కోనసాగుతుంది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఫార్మా, టెక్స్ టైల్స్, గోల్డ్ మరియు డైమండ్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఈ రంగాలు నష్టపోతాయన్న అంచనాలు అయితే బాగా వినపడుతున్నాయి. అమెరికాలో ధరలు పెరగడం వల్ల ఇండియా నుంచి దిగుమతి తక్కువవుతుంది. ఇండియన్ కంపెనీలకు ఆర్డర్లు తగ్గడమే కాకుండా, ఉద్యోగాల్లో కోత, ఎగుమతుల ఆదాయం పడిపోవడంతో రూపాయి విలువ మరింత క్షీణించనుంది.