యూపీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

అలహాబాద్ కోర్టు ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

Update: 2021-12-24 08:11 GMT

ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతుండటంతో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సందిగ్దత నెలకొంది. అలహాబాద్ కోర్టు ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తేనే మంచిదని కోర్టు సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

యూపీలో పర్యటించి....
ఈ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం విడతల వారీగా షెడ్యూల్ ను విడుల చేయాల్సి ఉంది. అయితే దీనిపై అలహాబాద్ కోర్టు కోవిడ్ దృష్యా వాయిదా వేయమని సూచించడంతో ఎన్నికల సంఘం ఆలోచనలో పడింది. కోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. వచ్చే వారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తుంది. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


Tags:    

Similar News