ప్రారంభమయిన అఖిలపక్ష సమావేశం

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం ప్రారంభమయింది.

Update: 2025-01-30 06:42 GMT

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం ప్రారంభమయింది. పార్లమెంట్ అనెక్స్ భవనం లో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీ ప్రారంభమయింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్ పై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది.

సజావుగా సాగేలా...
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పాలకపక్షం అఖిలపక్ష నేతలను కోరనుంది. అఖిలపక్ష సమావేశానికి ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరు కానున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై కూడా తాము ఇచ్చే వాయిదా తీర్మానాలను చర్చించాల్సిందేనని విపక్ష నేతలు పట్టుబబట్టనున్నారు. తాము లేవనెత్తే ప్రధాన అంశాలపై చర్చించాలని కోరనున్నారు.


Tags:    

Similar News