అహ్మదాబాద్ మృతులకు ఎయిర్ ఇండియా ఎక్స్ గ్రేషియో
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ గ్రేషియో ప్రకటించింది
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మృతి చెందిన ఒక్కక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలను ప్రకటించింది. అహ్మదాబాద్ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు అది కూలడంతో చనిపోయిన వారితో కలిపి 274 మంది మరణించారు.
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం...
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసకుంది. AI-171 నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నెంబర్ విమానం నడపాలని నిర్ణయించింది. AI-159 విమానం అహ్మదాబాద్-లండన్ మధ్య సేవలందించనుంది.అయితే ఏటీసీతో ఎయిరిండియా పైలట్ చివరి సంభాషణ కూడా బయటకు వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ సుమిత్ సబర్వాల్ నో పవర్..నో థ్రస్ట్..గోయింగ్ డౌన్.. మేడే మేడే అంటూ ఏటీసీకి చెప్పిన మాటలు రికార్డయ్యాయి. ఏటీసీలో 5 సెకన్లలో ఆడియో రికార్డయింది.