హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు అరెస్ట్

బెంగళూరులోని ఎంజీ రోడ్‌లోని ఓ హోటల్‌లో వారు పార్టీ చేసుకుంటుండగా, అక్కడ పోలీసులు దాడి చేశారు.

Update: 2022-06-13 06:09 GMT

బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించిన అతడ్ని బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో పలు కోణాల్లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. "సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అతడ్ని ఉల్సూర్ పోలీసు స్టేషన్ కు తరలించాం'' అని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర ఎస్ గులేద్ తెలిపారు. సిద్ధాంత్ కపూర్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. బెంగళూరులోని ఎంజీ రోడ్‌లోని ఓ హోటల్‌లో వారు పార్టీ చేసుకుంటుండగా, అక్కడ పోలీసులు దాడి చేశారు. సిద్ధాంత్ కపూర్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధా కపూర్ సోదరుడు. సిద్ధాంత్ కపూర్ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించాడు. సిద్ధాంత్ తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి హసీనా పార్కర్ చిత్రంలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నాడు.

డ్రగ్స్ సేవించి అనుమానాస్పద రీతిలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శ్రద్ధాకపూర్ ను విచారించడం తెలిసిందే. శ్రద్ధా కపూర్, సుశాంత్ కలిసి చిచోరే సినిమా చేశారు. లోనా వాలా లోని సుశాంత్ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి ఆమె చాలాసార్లు హాజరైనట్లు చెప్పబడింది. విచారణ సమయంలో తాను పార్టీకి హాజరయ్యానని, అయితే డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది.


Tags:    

Similar News