నటి ప్రకృతిని జుట్టు పట్టుకుని కొట్టిన హీరో భార్య

నటి ప్రకృతిని జుట్టు పట్టుకుని కొట్టిన హీరో భార్య

Update: 2022-07-24 13:31 GMT

ఒడియా హీరో బబూసన్‌ భార్య తృప్తి.. హీరోయిన్‌ ప్రకృతిపై దాడి చేసింది. భర్తతో అక్రమసంబంధం పెట్టుకుందన్న కారణంతో కారులో వెళ్తున్న నటిని అడ్డుకుని నడిరోడ్డుపై జుట్టుపట్టి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఒడియా హీరోయిన్‌ ప్రకృతి మిశ్రా, హీరో బబుసన్‌ మెహంతి ప్రేమమ్‌ సినిమాలో కలిసి నటించారు. ఉత్కల్‌ అసోసియేషన్‌ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. మెహంతి భార్య తృప్తి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని.. మాయచేసి బుట్టలో వేసుకుందని ఆగ్రహంతో ఊగిపోయింది. శనివారం నాడు భువనేశ్వర్‌ నుంచి తన భర్తతో బయలు దేరిన ప్రకృతి కారును రోడ్డుమీదే అడ్డగించింది. ప్రకృతి కారులోకి ఎక్కిన తృప్తి ఆమెను జుట్టుపట్టుకుని లాగింది. దీంతో ప్రకృతి భయంతో దయచేసి సాయం చేయండి అని అడుక్కుంది. ప్రకృతి, తృప్తి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కారు దిగిన ప్రకృతి పరుగులు పెట్టింది.

ఈ ఇష్యూపై స్పందించిన ప్రకృతి.. 'మహిళల వాదనకు ఎక్కడా మద్దతు లభించడం లేదు. ప్రతీ విషయంలో మాదే తప్పని నిందిస్తున్న ఇలాంటి సమాజంలో బతుకుతుండటం దురదృష్టకరం. సహ నటుడు బబూసన్‌తో ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న అతడి భార్య కొంతమందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేసింది. మానసికంగానూ హింసించింది. ఇది అస్సలు కరెక్ట్‌ కాదు. నేను మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాను. ఈ క్రమంలోనే రియాలిటీలో వేధింపులకు గురవుతున్నాను. ఏదేమైనా మహిళా సాధికారతను సాధించడమే నా లక్ష్యం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


Tags:    

Similar News