Delhi : ఢిల్లీ కుప్ప కూలిన ఆరంతస్థుల భవనం.. నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఆరు అంతస్థుల భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు మరణించారు

Update: 2025-04-19 02:25 GMT

దేశ రాజధాని ఢిల్లీలో ఆరు అంతస్థుల భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు మరణించినట్లు సమాచారం. భవనాల శిధిలాల కింద మరికొందరు ఉంటారని అనుమానిస్తున్నారు. భవనం కుప్పకూలిందని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కూలిన భవనంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

మరికొందరు జాడ కోసం...
గురువారం రాత్రి ఈ ఘటన జరిగిదంి. నలుగురు చనిపోయారని, మరికొందరు ఈ ఘటనలో గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఐదుగురు పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతుండటంతో వారి కోసం శిధిలాల కింద వెదుకుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News