జంతు ప్రేమికుడిని కడసారి చూసేందుకు వచ్చిన కొండముచ్చు
ఝార్ఖండ్‌లో ఓ వ్యక్తి చనిపోయి ఉంటే అతడిని కడసారి చూసేందుకు కొండముచ్చు వచ్చిన ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది
Jarkhand
ఝార్ఖండ్‌లో ఓ వ్యక్తి చనిపోయి ఉంటే అతడిని కడసారి చూసేందుకు కొండముచ్చు వచ్చిన ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. దేవఘర్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నాసింగ్ జంతు ప్రేమికుడు. కోతులు, కొండముచ్చులు సహా ఎన్నో జంతువులను జాగ్రత్తగా చూసుకునేవారు. అయితే మున్నాసింగ్ చనిపోయారు.
ఆప్తుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటి బయట ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు చాలామంది వచ్చారు. అదే సమయంలో ఒక కొండముచ్చు కూడా మున్నాసింగ్ మృతదేహం వద్దకు చేరుకొని, ఆయన ముఖాన్ని చాలాసేపు తీక్షణంగా చూసింది. గంటల తరబడి కూర్చొని, అంతిమయాత్రలోనూ పాల్గొంది. జంతువులకు కూడా ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని ఈ ఘటన ఓ ఉదాహరణ.