నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు

నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది.

Update: 2025-11-20 04:35 GMT

నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపు పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో ఇవాళ సుప్రీం తీర్పు వెలువరించనుంది. శాసనసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడంతో ఆలస్యం అవుతుందని అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

అనేక బిల్లులు...
ఇప్పటికే అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పలు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి గడువు విధించడంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై ఇవాళ తీర్పు వెలువరించనున్న సుప్రీం ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విని సెప్టెంబర్‌ 11న తీర్పు సుప్రీంకోర్టు రిజర్వు చేసింది.


Tags:    

Similar News