82 లక్షల బెంజ్ కారు 2.5 లక్షలకే అమ్మేసి.. ఇప్పుడేమో!!

జులై 1 నుంచి ఢిల్లీలో అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు తమ వాహనాలను కారుచౌకగా అమ్మేశారు.

Update: 2025-07-05 13:00 GMT

Benz

జులై 1 నుంచి ఢిల్లీలో అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు తమ వాహనాలను కారుచౌకగా అమ్మేశారు.పదేళ్లు పైబడిన డీజిలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోలు వాహనాలకు బంకుల్లో ఇంధనం పోసేది లేదని ప్రభుత్వం ప్రకటించగా ఆయా కార్లను తక్కువ ధరలకే అమ్ముకున్నారు. అయితే కొత్త వాహన పాలసీపై ఢిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదేదో ప్రభుత్వ ప్రకటనతో తనలాంటి ఎంతోమంది వాహనదారులు నష్టపోయారని ఢిల్లీకి చెందిన నితిన్‌ గోయల్‌ తెలిపారు. 65 లక్షల జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను 8 లక్షల రూపాయలకే అమ్మేశారు. రితేశ్‌ గందోత్ర అనే మరో యజమాని 55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును అతి తక్కువ రేటుకు విక్రయించారు. ఇలా ఎంతో మంది ప్రభుత్వ నియమ నిబంధలకు భయపడి తక్కువ ధరకు అమ్మేశారు.

Tags:    

Similar News