రైతు ఖాతాలో రూ.15 లక్షలు.. మోదీ వేశారనుకుని ఇల్లుకట్టుకున్నాడు.. తీరా చూస్తే !

ఇటీవల ధ్యానేశ్వర్‌కు గ్రామ పంచాయతీ నుంచి ఓ లేఖ అందింది. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు

Update: 2022-02-09 06:01 GMT

మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఖాతాలోకి ఒక్కసారిగా రూ.15 లక్షలు వచ్చిపడ్డాయి. దాంతో ప్రధాని మోదీనే తన ఖాతాలో డబ్బు వేశారనుకుని సంబరపడిపోయాడు. వాటిలోంచి రూ.9 లక్షలు తీసి ఇల్లు కట్టుకున్నాడు. మిగతా రూ.6 లక్షలను దేని కోసం వెచ్చించాలని ఆలోచిస్తున్నాడు. ఇంతలోనే పిడుగు లాంటి వార్త.. ఆ రైతును కష్టాల్లోకి నెట్టేసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్ వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్దన్ ఔటే వృత్తి రీత్యా రైతు.

గతంలో ఓసారి తన జనధన్ ఖాతాను చెక్ చేసుకోగా.. అందులో రూ.15 లక్షలు కనిపించాయి. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో సొమ్ము కనిపించడంతో ధ్యానేశ్వర్ షాకయ్యాడు. ప్రధాని మోదీ తన ఖాతాలో సొమ్ము వేశారని భావించి.. ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్ పంపాడు. ఆ తర్వాత వాటిలోంచి రూ.9 లక్షలు తీసి ఇల్లు కట్టుకున్నాడు. అక్కడివరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే షాకింగ్ నిజం తెలిసింది.
ఇటీవల ధ్యానేశ్వర్‌కు గ్రామ పంచాయతీ నుంచి ఓ లేఖ అందింది. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులు అందులో పేర్కొన్నారు. ధ్యానేశ్వర్ ఖాతాలో నగదు జమ అయిన ఐదు నెలల తర్వాత తేరుకున్న అధికారులు.. తీరికగా ఈ లేఖ పంపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లేఖ చదివిన ధ్యానేశ్వర్‌కు నోటమాట పడిపోయినంత పనైంది. ఆ వెంటనే తేరుకుని ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలను వారికి చెల్లించాడు. మిగతా రూ.9 లక్షలు ఎలా తిరిగి ఇవ్వాలో.. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో తెలియక కంగారు పడుతున్నాడు.


Tags:    

Similar News