ఒడిశాలో అక్రమ వలసదారుల అరెస్ట్

ఒడిశాలో అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-11-20 12:20 GMT

ఒడిశాలో అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ వలసదారులపై ఒడిశా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ లో మరింత వేగం పెంచింది. ఈ డ్రైవ్‌లో భాగంగా జగత్సింగ్‌పూర్‌ పోలీసులు గురువారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.అక్రమ వలసదారులకు ఆశ్రయం, అద్దె గదులు కల్పించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సికందర్‌ ఆలమ్‌ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

అక్రమంగా ఉంటున్న...
ధానీపూర్‌ స్లమ్‌లోని అతని నివాసంలో జరిగిన సోదాల్లో కొందరు అక్రమ వలసదారులున్నట్లు గుర్తించారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండు ప్లాటూన్ల పోలీసులను మోహరించారు. సీనియర్‌ అధికారుల ఆధ్వర్యంలో దాడులు జరిగినట్లు పోలీసులు చెప్పారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన చర్యల్లో ఈ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్టు తెలిపారు.


Tags:    

Similar News