కర్ణాటక సంక్షోభం పై డీకే ఏమన్నారంటే?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెరదించారు

Update: 2025-11-21 12:21 GMT

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెరదించారు. గత రెండు రోజులుగా డీకే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీకివెళ్లి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు కావడంతో సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగాచేయాలని ఎమ్మెల్యేలు హస్తినకు బయలుదేరి వెళ్లారు. అయితే డీకే శివకుమార్ మాత్రం ఐదేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని తేల్చి చెప్పారు.

సిద్ధరామయ్య కూడా...
తామంతా సిద్ధరామయ్యకు సహకరిస్తామని తెలిపిన డీకే శివకుమార్‌అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. అలాగే సిద్దరామయ్య కూడా ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. వచ్చే బడ్జెట్‌ కూడా తానే ప్రవేశపెడతానని ప్రకటించిన సిద్ధరామయ్య రేపు మల్లికార్జున ఖర్గేను కలుస్తానని తెలిపారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ హైకమాండ్‌ చేస్తుందన్న సిద్ధరాయమ్య తానైనా.. డీకే శివకుమార్‌ అయినా హైకమాండ్‌ నిర్ణయం మేరకే నడుచుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.


Tags:    

Similar News